ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భలే గిరాకీ.. మాస్కులతోపాటు ఫేస్​ షీల్డ్స్​కు పెరిగిన ఆదరణ - hyderabad latest news

హైదరాబాద్.. జీహెచ్​ఎంసీ పరిధిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు మరింత అప్రమత్తమవుతున్నారు. వైరస్ సోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు, ఫేస్ షీల్డ్స్ కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా వ్యాపారులు, బయట ఎక్కువగా తిరిగేవారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

face-shields
face-shields

By

Published : Jun 27, 2020, 6:27 PM IST

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు వచ్చే వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కులతోపాటు ఫేస్ షీల్డ్స్ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రతి నిత్యం ఎక్కువ మందితో మాట్లాడాల్సి వస్తుంది. వీళ్లు కచ్చితంగా ఫేస్ షీల్డ్స్ నే ధరిస్తామంటున్నారు. మార్కెటింగ్​లో భాగంగా ఎక్కువగా తిరిగేవాళ్లు, వీటిని ధరిస్తున్నారు.

భలే గిరాకీ.. మాస్కులతోపాటు ఫేస్​ షీల్డ్స్​కు పెరిగిన ఆదరణ

ABOUT THE AUTHOR

...view details