కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆన్లైన్లో అత్యవసర కేసులు విచారించాలని నిర్ణయించిన హైకోర్టు ఆ గడువును పెంచింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 3 వరకు అత్యవసర కేసులను హైకోర్టుతో పాటు దాని నియంత్రణలో పనిచేసే ఏపీ న్యాయ సేవాధికార సంస్థ , హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ , మధ్యవర్తిత్వ కేంద్రాల్లో విచారణలు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు . అన్ని తరహా వ్యాజ్యాలను ఈ - ఫైలింగ్ విధానంలోనే దాఖలు చేయాలన్నారు.
ఇంటివద్ద నుంచే విచారణలు కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తులు భావిస్తే ఆ విధానాన్నే అనుసరించొచ్చని తెలిపారు. జూన్ 24 నుంచి దాఖలైన వ్యాజ్యాలను వరుస క్రమంలో విచారణకు తీసుకుంటారన్నారు . అత్యవసరం ఉన్న కేసుల్లో దరఖాస్తు దాఖలు చేసుకుంటే హైకోర్టు సీజే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
స్టాండింగ్ కౌన్సిళ్ల రాజీనామాలు ఆమోదం