ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు - ఎ.బి.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు వార్తలు
17:45 January 19
6 నెలలపాటు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 6 నెలల పాటు సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సస్పెన్షన్ పొడిగింపు ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గతంలో విధుల్లో నుంచి తొలగించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు
TAGGED:
ab venkateswara rao