ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాదాబైనామా భూముల సమస్యలపై దరఖాస్తుకు గడువు 2023

Sadabainama lands గతంలో భూముల కొనుగొళ్లు అన్ని తెల్లకాగితంపైనే నడిచేవి, రెవెన్యూ శాఖలో మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే భూములు తెల్లకాగితం పై అమ్మిన తరువాత మళ్లి ఇబ్బందులు ఎదురవ్వడం పరిపాటిగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం సాధా బైనామాలతో జరిగిన భూముల లావాదేవీలకు పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

సాదాబైనామా సమస్యలు
Sadabainama lands

By

Published : Aug 19, 2022, 5:43 PM IST

Sadabainama lands సాదా బైనామాలతో జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ గురువారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెల్లకాగితాలపై 01.11.2021కి ముందు (ఆన్‌ రిజిస్టర్డ్‌ స్టాంపు పేపర్లు)జరిగిన భూలావాదేవీలపై తగిన ఆధారాలతో 2023 డిసెంబర్‌ 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. గ్రామాల్లో రీ-సర్వే జరుగుతుండగా సాదా బైనామా భూములకు సంబంధించి పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి.

వీటిపై యాజమాన్య హక్కుల మాటేమిటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూశాఖ ప్రకటన జారీ చేసింది. ఇంతకుముందు 2000 డిసెంబర్‌ 31కి ముందు జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించి మాత్రమే దరఖాస్తుల స్వీకరణ జరిగింది. తాజా నోటిఫికేషన్‌లో 2021 ముందు వరకూ జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. దీంతో రైతులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రకటనలో పేర్కొన్న అంశాలపై 12రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details