పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల పరిష్కారానికి గడువును 2022 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా 2021 సెప్టెంబరు 31లోగా అందుకున్న దరఖాస్తులను పరిష్కరించేందుకు గడవు పెంచుతూ పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ.. దరఖాస్తుల పరిష్కార గడువు పొడిగింపు - ఏపీలో అనధికార లేఅవుట్లు
పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడువును 2022 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
జగనన్న స్మార్ట్ టౌన్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిమగ్నమైనందున దరఖాస్తుల పరిశీలన ఆలస్యమవుతూ వస్తోందని పురపాలక శాఖ పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ 2020 పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 43,753 దరఖాస్తులు రాగా.. వాటిలో 14,218 దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిష్కరించారు. ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు నిర్దేశిత ప్రామాణిక విధానాన్ని పాటించాలని సూచిస్తూ శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: