తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలోని ఓ ఇంటి ముందు అనుమానాస్పద స్థితిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వెంకట్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Explosion: వికారాబాద్ జిల్లాలో పేలుడు కలకలం... ఒకరికి తీవ్ర గాయాలు.. - తెలంగాణ 2021 వార్తలు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్లోని ఓ ఇంటిముందు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
blast
డీఎస్పీ లక్ష్మీనారాయణ, గ్రామీణ సీఐ జలంధర్ రెడ్డిలు... పేలుడు ఎలా సంభవించింది, అసలేం పేలిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రజలను ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే పేలుడుపై పూర్తి వివరాలు తెలుసుకుంటాని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి