ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీరూట్​లో పేలుడు ఘటన... అప్రమత్తమైన ఏపీ పోలీసులు - ఏపీ పోలీస్ తాజా వార్తలు

బీరూట్​లో అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం, వినియోగంపై సముద్ర తీరప్రాంతాల జిల్లాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు అర్బన్, నెల్లూరు, తిరుపతి అర్బన్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీలతో డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Vigilant AP police
అప్రమత్తమైన ఏపీ పోలీసులు

By

Published : Aug 14, 2020, 6:07 PM IST

జిల్లాల్లో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు, వినియోగం, జాతీయ, అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల వద్ద నిల్వలు, విక్రయాలపైన 2012లో రూపొందించిన నిబంధనలను ఎస్పీలకు డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. అమ్మోనియం నైట్రేట్‌ వినియోగంపై కచ్చితమైన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, పేలుడు పదార్థాల రవాణా, వినియోగం, అమ్మకాలు, కొనుగోళ్లు, నిల్వ కేంద్రాలు మొదలైన వాటికి సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించి, పర్యవేక్షించాలని ఎస్పీలను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details