రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ... సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజధాని సహా అన్ని ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ... వివిధ వర్గాల అభిప్రాయాలు, అభ్యంతరాల్ని సేకరించింది. నిపుణుల కమిటీ... రాజధానిలో నిర్మాణాలు, ప్రాజెక్టులపై ఎలాంటి సిఫార్సులు చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం... పోలవరం-బొల్లాపల్లి- బనకచర్ల ప్రాజెక్టులపై ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సీఎం జగన్ తిలకించనున్నారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశముంది.