అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుతున్న సందర్బంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ స్కై టవర్ వద్ద ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. అమరావతి రైతులు 300 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని చూసి చలించామన్నారు. అందుకే వారికి మద్దతు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చామన్నారు. రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చి.. త్యాగం చేసిన గొప్ప మనసు అమరావతి రైతులదని కొనియాడారు. అలాంటి రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సబబు కాదన్నారు.
న్యూజిలాండ్: అమరావతి రైతులకు ప్రవాసాంధ్రుల మద్దతు - అమరావతి రైతుల ధర్నా
అమరావతి రైతులకు న్యూజిలాండ్‌లోని తెలుగువారు మద్దతు తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 300 రోజులకు చేరుతున్న క్రమంలో వారికి మద్దతు తెలుపుతూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
Expatriates in New Zealand
TAGGED:
అమరావతి రైతుల ధర్నా