ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఫార్మా జోన్‌ విస్తరణ - international airport in hyderabad

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫార్మా జోన్‌ విస్తరణకు జీఎంఆర్‌ ఎయిర్‌కార్గో (జీహెచ్‌ఏసీ) సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఫార్మా అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు మెరుగు పరచడంపై దృష్టి సారించింది. ఫార్మా జోన్​ను రెండింతలు విస్తరించేందుకు జీహెచ్​ఏసీ నిర్ణయించింది.

expansion of pharma zone at Hyderabad
హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఫార్మా జోన్‌ విస్తరణ

By

Published : May 27, 2021, 11:26 AM IST

హైదరాబాద్‌లో తయారయ్యే వ్యాక్సిన్లను దేశవిదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటూ తగిన ఉష్ణోగ్రతల వద్ద రవాణా సదుపాయాలు కల్పిస్తోంది. రానున్న రోజుల్లో వ్యాక్సిన్లు, ఇతర ఔషధ సామగ్రి పెద్దఎత్తున రవాణా జరుగనున్న నేపథ్యంలో ఫార్మా జోన్‌ను రెండింతలు విస్తరించేందుకు జీహెచ్‌ఏసీ నిర్ణయించింది. 2011 జనవరి 1 నుంచి విమానాశ్రయంలో ఫార్మాజోన్‌ అందుబాటులోకి వచ్చింది. 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో అప్పట్లో నిర్మించారు.

ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా..

ఇందులో 15-25 డిగ్రీలు, 2-8 డిగ్రీలు, మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా జోన్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం పెంచడంపై జీహెచ్‌ఏసీ దృష్టి పెట్టింది. పలు వ్యాక్సిన్లు మైనస్‌ 20 కంటే తక్కువ శీతల స్థితిలో భద్రపరచాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా జోన్లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఫార్మా సామగ్రి అన్‌లోడ్‌ సమయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు నివారించేందుకు ప్రత్యేకంగా కోల్డ్‌ సూపర్‌ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు

  • కొవిడ్‌ సంబంధిత ఔషధాలు, ఇతర సామగ్రిని వేగంగా రవాణా చేసేందుకు వీలుగా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తోంది. కస్టమ్స్‌, విమానయాన సంస్థలు, సరకు రవాణా కంపెనీలు, ఇతర భాగస్వాములతో ఈ బృందం పని చేస్తోంది. కరోనా రోగులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఎక్కువగా అవసరం అవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ దేశాలతోపాటు భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి 11,500 యూనిట్లకుపైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు చేరుకున్నాయి.
  • జనవరి నుంచి 100 టన్నులకుపైగా వ్యాక్సిన్లు రవాణా అయ్యాయి. ఇప్పటికే 2.10 లక్షల స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు వచ్చాయి. వీటిని మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రవాణా చేశారు. వచ్చే రెండేళ్ల కాలంలో హైదరాబాద్‌లో 360 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి అవుతాయని అంచనా. అందుకు తగ్గట్టుగా వాటిని రవాణా చేసేందుకు విమానాశ్రయం సిద్ధమవుతున్నట్లు అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:

నిండు గర్భిణి కూర్మాసనం.. ప్రపంచ రికార్డు సొంతం!

ABOUT THE AUTHOR

...view details