రాజధాని అమరావతిలో ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే మరో భవనాన్ని ప్రభుత్వం నిర్మించబోతుంది. హైకోర్టు భవనంలో స్థలం సరిపోకపోవటంతో న్యాయస్థానం సూచన మేరుకు ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి ఏఎంఆర్డీ టెండర్లు పిలిచింది. రూ.29.40 కోట్లు అంచనా వ్యయంతో ఆరు నెలల్లో పూర్తి చేయాలని టెండర్ నోటీసులో పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జీ+5 భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. ప్రస్తుతానికి జీ+3 మాత్రమే నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మిత ప్రాంతం 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 60 కార్లకు పార్కింగ్ వసతి కల్పించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిటీ కోర్టు కాంప్లెక్సుగా నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.