ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణాల్లో అవకతవకల నేపథ్యంలో...ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్! - ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలు

విశాఖలో మద్యం విక్రయాల సొమ్ము అవకతవకలతో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌శాఖ తనిఖీలు నిర్వహించింది.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశాలతో ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

Minister Narayanaswamy
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

By

Published : Jun 9, 2021, 4:58 PM IST

విశాఖలోని కొన్ని మద్యం దుకాణాల్లో నగదు అవకతవకల ఘటన నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేపట్టింది. విశాఖ సహా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరిగినట్టుగా ఫిర్యాదులు రావటంతో.. ఆ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా.. మద్యం విక్రయాల మొత్తం డిపాజిట్​లను, అలాగే రికార్డులను కూడా ఎక్సైజ్ శాఖ పరిశీలించనుంది. తమ పరిధిలోని దుకాణాలను కాకుండా జంబ్లింగ్‌ విధానంలో తనిఖీలు చేపట్టాల్సిందిగా ఎక్సైజ్‌ శాఖ సీఐలకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,894 దుకాణాల్లోనూ తనిఖీలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఇప్పటికే విశాఖలోని 14 మద్యం దుకాణాల్లో 34 లక్షల మేర నగదు అవకతవకలు జరిగినట్టుగా ఎక్సైజు శాఖ గుర్తించింది. ఈ ఘటనలో ఒక ఎక్సైజు శాఖ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details