అసెంబ్లీ ఫర్నిచర్ అంశంపై హైకోర్టులో కోడెల పిటిషన్ - kodela
అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జూన్‌లోనే ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాసినట్లు మాజీ సభాపతి కోడెల పిటిషన్‌లో పేర్కొన్నారు.
kodela
అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఫర్నీచర్ అంశంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫర్నిచర్ తీసుకువెళ్లే విధంగా అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించాలంటూ పిటిషన్‌లో కోడెల కోరారు. ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవాలని జూన్‌లోనే అధికారులకు లేఖ రాశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీనితో విచారణ రేపటికి వాయిదా పడింది.