జీహెచ్‌ఎంసీ ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. పోటాపోటీగా ఫలితాలొస్తే మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫిషియో సభ్యులు కీలకపాత్ర పోషించనున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 45 మంది ఎక్స్అఫిషియో సభ్యులున్నారు. ఇందులో తెరాసకు 31 మంది, ఎంఐఎం 10, భాజపా, కాంగ్రెస్‌కు చెరో ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు.
ప్రస్తుత జాబితా ప్రకారం 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే మొత్తం సభ్యుల బలం గల పార్టీయే జీహెచ్‌ఎంసీ మేయర్, ఉపమేయర్ స్థానాలను గెలిచే వీలుంటుంది.
- తెరాసకు ప్రస్తుతం 31 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల బలం ఉండగా... ఇంకా 67 స్థానాలను పొందాలి.
- ఎంఐఎం(మజ్లిస్) పార్టీకి 10 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా... ఇంకా 88 డివిజన్లలో గెలవాలి.
- భాజపాకు ప్రస్తుతం ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా... ఇంకా 96 స్థానాలు దక్కాలి.
- కాంగ్రెస్‌కు 1 సభ్యుడు ఉండగా... ఇంకా 97 స్థానాలు కావాలి.