ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​ను కలిసిన ఆదివాసీ సంఘాలు.. ఐటీడీఏ ఏర్పాటుకు వినతి - గవర్నర్​తో ఆదివాసీల భేటీ

లంబాడి, సుగాలి, యానాది, ఎరుకల, చెంచుల అభివృద్ధికి సమగ్ర ఐటీడీఏను ఏర్పాటు చేయాలని గవర్నర్​ను కోరినట్లు మాజీ ఎంపీ రవీందర్ నాయక్ తెలిపారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్టీ కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

Ex mp ravindar naik meet governor for formation ITDA for tribal
గవర్నర్​ను కలిసిన ఆదివాసి సంఘాలు

By

Published : Feb 11, 2020, 11:01 PM IST

గవర్నర్​ను కలిసిన ఆదివాసి సంఘాలు

8 జిల్లాల్లోని లంబాడి, సుగాలి, యానాది, చెంచు వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్​ను ఆదివాసీ ప్రతినిధులు కోరారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసి సంఘాల నేతలు రాజ్​భవన్​లో​ గవర్నర్​ను కలిశారు. సమస్యలను వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలికి అనుగుణంగా గిరిజనులను ఆదుకోవాలని కోరినట్లు రవీందర్ నాయక్ తెలిపారు. మైదాన ప్రాంతాల్లోని 60 శాతం ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని, వీరందరికీ సమగ్ర ఐటీడీఏ ఏర్పాటుచేసి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించాలని కోరామన్నారు. రాష్ట్రంలో 150 నుంచి 500 మంది జనాభా కల్గిన సుగాలి తాండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, ఎస్టీ కులాల వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఎస్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కమిషన్​ ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాలని గవర్నర్​ను కోరామన్నారు.

ఇదీ చదవండి:

డ్రైవర్ సాహసంతో అదుపులోకి గ్యాస్ ట్యాంకర్ లీకేజీ

ABOUT THE AUTHOR

...view details