ఈ ఏడాది ధాన్యం గణనీయమైన దిగుబడి వచ్చింది. కొవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సరిగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఇటీవల పడుతున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గోదాముల వద్ద ధాన్యం తడిసి ముద్దైపోయింది. ఈ తడిచిన ధాన్యం కొనేందుకు పౌరసరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ కొత్త ఆలోచన చేశారు.
500 రూపాయలతో..
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం.. వానలకు తడిచిపోతుంటే రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతంపై స్పందించారు. తరచూ కొత్త ప్రయోగాలు, ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేపట్టే విశ్వేశ్వర్‌రెడ్డి.. కేవలం 500 రూపాయల ఖర్చుతో ఆరబోసిన లేదా గోదాముల బయట ఎండబెట్టిన ధాన్యం వర్షం నుంచి కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపారు.