ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలి: హర్ష కుమార్ - సీఎం జగన్ పై హర్ష కుమార్ ఫైర్

ఇళ్ల స్థలాల పేరుతో ఎస్సీల నుంచి స్థలాలు లాక్కున్న సీఎం జగన్​కు కూడా సీఐడీ నోటీసులివ్వాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

ex mp harsha kumar
ex mp harsha kumar

By

Published : Mar 17, 2021, 3:26 PM IST

Updated : Mar 17, 2021, 4:03 PM IST

మాజీ ఎంపీ హర్ష కుమార్

అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో ఎస్సీల నుంచి భూములు లాక్కున్నారని ఆరోపించారు. జగన్‌తో పాటు రెవెన్యూ మంత్రికి నోటీసులు ఇవ్వాలన్న ఆయన... ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు.

Last Updated : Mar 17, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details