సీఎం జగన్‌కు పరిపాలనపై విజన్ లేదని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. భాజపా, వైకాపా ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ... విపక్ష నేతలు, మేధావులను అణచివేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్న చింతా... జేసీ సోదరులు, అచ్చెన్నాయుడును రాజకీయ కక్షతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచి, ఓట్లు అడగటం శోచనీయమని వ్యాఖ్యానించారు.
జగన్‌కు పరిపాలనపై విజన్ లేదు: చింతామోహన్ - Chinta Mohan criticize BJP and YCP
భాజపా, వైకాపాలపై కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
![జగన్‌కు పరిపాలనపై విజన్ లేదు: చింతామోహన్ Chinta Mohan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10704486-794-10704486-1613814407458.jpg)
మాజీ మంత్రి చింతామోహన్