Ex MLA Daughter suicide: తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి (25) ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తమ స్వగృహంలో ఈరోజు(ఏప్రిల్ 14) ఉదయం మహాలక్ష్మి ఉరి వేసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి.. హుటాహుటిన భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉరేసుకుని మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య.. కారణమేంటి? - తాటి వెంకటేశ్వర్లు
Ex MLA Daughter suicide: తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో అశ్వరావుపేట, పినపాక ఎమ్మెల్యేగా పనిచేసిన తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె.. భద్రాద్రి కొత్తగూడెంలోని బూర్గంపాడు మండలం సారపాకలోని తమ స్వగృహంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు.
Ex MLA Daughter suicide
ఈ మధ్య కాలంలోనే మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు అశ్వరావుపేట, పినపాక శాసనసభ్యునిగా గతంలో పని చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: