తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీపైకి కాండం తొలుచు పురుగులాంటి సీఎంని వదిలారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీమంత్రి జవహర్ విమర్శించారు. ఆ దెబ్బకి తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే, ఏపీలో రెండెకరాలు కొనే స్థాయికి వ్యవస్థలన్నింటికీ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఒక ప్రెసిడెంట్ మెడల్ అమ్మితే వచ్చే సొమ్ముతో తెలంగాణలో మూడు మేన్షన్ హౌస్‌లు కొనేలా దోచుకోవటం మరో విశేషమని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
ఏపీపైకి కాండం తొలుచు పురుగులాంటి సీఎంని వదిలారు: జవహర్ - Ex Minster ks jawahar comments on KCR
సీఎం జగన్పై మాజీమంత్రి జవహర్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీపైకి కాండం తొలుచు పురుగులాంటి సీఎంని వదిలారని జగన్ను ఉద్దేశించి విమర్శించారు. ఏపీలో ఒక ప్రెసిడెంట్ మెడల్ అమ్మితే వచ్చే సొమ్ముతో తెలంగాణలో మూడు మేన్షన్ హౌస్‌లు కొనేలా దోచుకోవటం మరో విశేషమని ఎద్దేవా చేశారు.
మాజీమంత్రి జవహర్