రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఆర్థిక విపత్తు సృష్టించిందనే విషయం.. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ద్వారా స్పష్టమైందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయటం ఆర్థిక విపత్తును తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను ఎంత తీవ్రంగా దెబ్బతీసిందో.. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇకపై ఇష్టానుసారం అప్పులు చేయటం కుదరదంటూ.. కేంద్రం రాసిన లేఖను ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని యనమల డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం రాసిన లేఖను బహిర్గతం చేయాలి: యనమల - ap news
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి ప్రభుత్వం అప్పులు చేయటం ఆర్థిక విపత్తును తలపిస్తోందని అన్నారు. ఇదే విషయంపై కేంద్రం రాసిన లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ex minister yanamala ramakrishnudu