ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజలు కష్టాల్లో ఉంటే ఏడాది పాలన సంబరాలా..?: యనమల - ex minister yanamala news

ఏడాది వైకాపా పాలనలో పథకాల పేర్ల మార్పు తప్ప కొత్తగా చేసిందేమీ లేదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఏడాది పాలన సంబరాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

yanamala
yanamala

By

Published : May 24, 2020, 9:44 AM IST

జగన్ ఏడాది పాలన వైకాపా నాయకులకే 100 శాతం సంతృప్తినిచ్చింది తప్ప ఏ వర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు నవ మోసాలుగా చేసినందుకు 100 మార్కులా..? అని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉన్న స్కీములు రద్దు చేసి, పేర్లుమార్చారే తప్ప కొత్తగా ఇచ్చింది శూన్యమని ఆక్షేపించారు. తప్పుడు కేసులతో అన్నివర్గాల ప్రజలను క్షోభ పెట్టారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details