ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ అసమర్థతోనే రాష్ట్రాన్ని దివాలా తీయించారు' - yanamala fiers on cm jagan

రాబడులు పెంచడం, రెవెన్యూ వ్యయంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్ చేతగానితనంతోనే రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex minister yanamala
ex minister yanamala

By

Published : May 31, 2020, 1:38 PM IST

సీఎం జగన్ తన చేతగానితనంతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేశారు కాబట్టే పెట్టుబడులు పడకేశాయని మండిపడ్డారు. ప్రైవేటు పెట్టుబడులను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. రాబడులు పెంచడం, రెవెన్యూ వ్యయంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

ఈ ఏడాది పాలనలో రెవెన్యూ వ్యయం 42 శాతం పెంచారని తెలిపారు. పెద్దఎత్తున వాలంటీర్లను, సచివాలయ సిబ్బందికి ప్రజాధనం దోచిపెట్టడం వల్లే రెవెన్యూ వ్యయం పెరిగిందని దుయ్యబట్టారు. చివరికి ప్రభుత్వ భూములు అమ్మే దుస్థితికి దిగజార్చారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details