తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్ని... సీఎం జగన్ ఆపేస్తారా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఆ పథకం ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
సున్నా వడ్డీ పేరుతో కొత్త జీవో 464 తెచ్చి పావలావడ్డీ ఎత్తేశారని... పావలావడ్డీకి రైతులు 3 శాతం చెల్లిస్తే ప్రభుత్వం ఒక్కశాతమే చెల్లించాలన్నారు.