RESIGN: భాజపాకు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేశారు. రాజీనామా లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఆయన భాజపాలో చేరారు. అయితే కొద్ది కాలంగా భాజపా నిర్వహించే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు రాజీనామా చేశారు.
భాజపాకు మాజీ మంత్రి రావెల రాజీనామా.. కారణం ఇదే! - మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా
RESIGN: భాజపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
భాజపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా