రివర్స్ టెండరింగ్ విధానం వద్దని కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ కమిటీ చెప్పినా... ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పోలవరంపై తొందరపాటు నిర్ణయానికి హైకోర్టు సరైన సమాధానమిచ్చిందని అభిప్రాయపడ్డారు. అనినీతి జరిగిందనే ముద్రవేయాలనే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆయన.. హైకోర్టు తీర్పుతోనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజప్రయోజన కార్యక్రమాలపై దృష్టి సారించి.. సానుకూల వైఖరితో పరిపాలన కొనసాగించాలని సూచించారు.
' ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'
పోలవరంపై తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హితవుపలికారు.
' ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'