ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాపై తప్పుడు కేసు పెడితే.. న్యాయ పోరాటం చేస్తా: ప్రత్తిపాటి - అమరావతిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానంలో పోరాటం చేస్తానని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాజధానిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వం తనపై ఆరోపణలు చేస్తోందని అన్నారు.

ex minister pathipati pullarao
ex minister pathipati pullarao

By

Published : Sep 4, 2020, 4:41 PM IST

Updated : Sep 4, 2020, 4:56 PM IST

రాజధానిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వం తనపై తప్పుడు కేసు పెట్టేందుకు యత్నిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానంలో పోరాటం చేస్తానని తెలిపారు. తుళ్లూరు మండలం ఐనవోలులో రైతుల నిరసనకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.

రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని... అందుకే న్యాయస్థానాలు అండగా నిలిచాయని చెప్పారు. రాజధాని వికేంద్రీ కరణ కంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తైతే దానిపై వచ్చే ఆదాయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

Last Updated : Sep 4, 2020, 4:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details