ఉద్యోగుల అభ్యున్నతి కోసమే ఉద్యోగ సంఘాలు పనిచేయాలని.. ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించవద్దని మాజీమంత్రి కె.ఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తామనడం సరికాదని.. రాజ్యాంగబద్ధ సంస్థలైన హైకోర్టు ఆదేశాలను తూచా తప్పక పాటించాలని ఆయన సూచించారు.
'రాజకీయపార్టీకి ఉద్యోగ సంఘాలు కొమ్ము కాయడం మానుకోవాలి' - ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు
కరోనా కాలంలో ఉద్యోగులను పట్టించుకోని ఉద్యోగ సంఘాల నాయకులు.. ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలకడం సరికాదని మాజీమంత్రి కె.ఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తామనడం తగదని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.
మాజీమంత్రి కె.ఎస్ జవహర్
కరోనా కాలంలో ఉద్యోగులను పట్టించుకోని ఉద్యోగ సంఘాల నాయకులు.. ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలకడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, అధికార పార్టీ ర్యాలీలు తీస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని ఆయన గుర్తుచేశారు.