వైకాపా ప్రభుత్వం వైద్యులను తీవ్రవాదులుగా చూస్తోందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో డాక్టర్ రమేశ్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ రమేశ్ కుమార్ ఆచూకీ కోసం లక్ష రూపాయల రివార్డు ప్రకటించటం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ చర్యలతో చాలామంది వైద్యులు మనోధైర్యం కోల్పోతున్నారని.. అందుకే చాలామంది కరోనా బాధితులకు వైద్యమందించేందుకు ముందుకు రావటం లేదని అన్నారు. వైద్యులపై వేధింపు చర్యలు ఆపి...కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
వైద్యులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: చినరాజప్ప - dr ramesh kumar case
డాక్టర్ రమేశ్ కుమార్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆచూకీపై రివార్డు ప్రకటించటం దారుణమన్నారు. వైద్యులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ex minister nimmakayala chinarajappa