ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దు: ముద్రగడ - kapu reservation news

కాపు రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్​కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ రాశారు. గతంలో మద్దతు తెలిపి.. ఇప్పుడు అమలు చేసేందుకు ఎందుకు చేతులు రావట్లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

సీఎం గారూ కాపు రిజర్వేషన్లు అమలు చేయండి: ముద్రగడ
సీఎం గారూ కాపు రిజర్వేషన్లు అమలు చేయండి: ముద్రగడ

By

Published : Jul 3, 2020, 10:12 AM IST

కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కి బహిరంగ లేఖ రాశారు. గతంలో అసెంబ్లీ, మీడియాలో కాపు రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపి.. తమ జాతి సానుభూతి ఓట్లు పొందారని ముద్రగడ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని హితవు పలికారు.

ముఖ్యమంత్రికి ముద్రగడ లేఖ

ABOUT THE AUTHOR

...view details