'ప్రభుత్వ ఉద్యోగులతోనే మద్యం అమ్మించడం సిగ్గుచేటు' - ex minister kollu ravindra
కొన్ని బ్రాండ్ల మద్యానికే అవకాశం కల్పించి.. ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని తెదేపా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రూ. 2వేల కోట్ల మేర జగన్ వసూలు చేయనున్నారని వ్యాఖ్యానించారు.
ex-minister-kollu-ravindra
మద్యం అమ్మకాల్లో కొన్ని బ్రాండ్లకే అవకాశం కల్పించడం ద్వారా 2 వేల కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి జగన్ వసూలు చేయనున్నారని తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. మూసి ఉన్న దుకాణాలనే... 20 శాతం తగ్గించిటన్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతోనే మద్యం అమ్మించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.