ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్ఈసీ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం మంచి ముగింపు' - నిమ్మగడ్డ నియామకంపై గవర్నర్ లేఖ

నాలుగు నెలలుగా ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వం చేసిన వృథా ప్రయాసకు గవర్నర్ మంచి ముగింపు పలికారని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వం.. రాజకీయాలకు పోయిందని విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని ఆదేశించి గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన పంథా మార్చుకుని కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఆర్డీఏ, మూడు రాజధానులు, ఎస్ఈసీ, 26 జిల్లాల వంటి అనవసర నిర్ణయాలు మానుకోవాలని హితవు పలికారు.

కామినేని శ్రీనివాస్
కామినేని శ్రీనివాస్

By

Published : Jul 22, 2020, 5:19 PM IST

Updated : Jul 22, 2020, 7:05 PM IST

ఎస్ఈసీ వ్యవహారంపై కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు

వైకాపా ప్రభుత్వం రాద్ధాంతం చేసిన అనవసర నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంచి ముగింపు ఇచ్చారని భాజపా నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ ఆదేశించడం మంచి పరిణామంగా అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించి, హైకోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రభుత్వం నాలుగు నెలలుగా ఎస్ఈసీ తొలగింపుపై నానాయాగి చేసిందన్నారు. హైకోర్టు రెండు సార్లు, సుప్రీంకోర్టులో మూడు సార్లు ఎదురుదెబ్బ తగిలినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు.

ఈ వ్యవహారం మొత్తం కరోనాతో మొదలైంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడంతో... ప్రభుత్వం ఆయనను తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సంస్కరణల పేరు ఆర్డినెన్స్​ తెచ్చింది. దీంతో ఎస్ఈసీ పదవీకాలం తగ్గించి రమేశ్ కుమార్ ను తొలగించారు.- కామినేని శ్రీనివాస్, భాజపా నేత

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశాలు సరిగా లేవన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడిపై దృష్టిపెట్టకుండా... నాలుగు నెలలుగా వృథా ప్రయాస చేసిందన్నారు. మహమ్మారిని నివారించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని గమనించి రాష్ట్రం కూడా అదే మార్గంలో నడవాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను విస్మరించి అనవసర ప్రయత్నాలు...ఎస్ఈసీ, సీఆర్డీఏ, మూడు రాజధానులు, 26 జిల్లాలపై దృష్టి పెడుతుందని ఆరోపించారు. గవర్నర్ ఇచ్చిన ఈ ఆదేశాలతోనైనా ప్రభుత్వం తన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి :అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..

Last Updated : Jul 22, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details