మూడు రాజధానులతో వైకాపా నేతలకు ఆర్థికంగా ఉపయోగం తప్ప...రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మూడు రాజధానులతో ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందే అవకాశం ఉండదని ఆయన అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించవచ్చన్నారు. కేవలం వైకాపా నేతల జేబులు నింపేందుకే 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఎంత మందికి ఉపాధి కల్పిస్తారనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ద్వారా సంపద సృష్టించి.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
వైకాపా నేతల జేబులు నింపేందుకే 3 రాజధానులు: కాల్వ - ex minister kalava srinivasulu news
వైకాపా నేతల జేబులు నింపేందుకే 3 రాజధానుల పేరుతో జగన్... రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. 3 రాజధానులతో ఎలాంటి ఉపయోగం లేదని.. అమరావతి నిర్మాణంతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు.
ex minister kalava srinivasulu