వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. దళితులను బెదిరించి లొంగతీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. వైద్యుడు సుధాకర్ విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని అన్నారు. సుధాకర్ విషయంలో ప్రభుత్వం మైండ్ గేమ్ ప్రారంభించిందని....సుధాకర్ కుటుంబంతో రాజీ చేసుకునేందుకు రంగంలోకి దళిత మంత్రిని దింపిందని ఆరోపించారు. కేసు విత్ డ్రా చేసుకోమని సుధాకర్ తల్లిపై మంత్రి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. సుధాకర్ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్న మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సుధాకర్‌కు అన్యాయం చేయాలని చూస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
సుధాకర్ తల్లిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు: జవహర్ - డాక్టర్ సుధాకర్ వార్తలు
వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను బెదిరించి ఎలాగైనా లొంగతీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్‌కు అన్యాయం చేయాలని చూస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ex minister k s Jawahar