ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు పోరాడాలి: జవహర్ - ex minister jawahar on telangana prc

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల పోరాటం ప్రారంభించాలని మాజీ మంత్రి జవహర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా ముందుకు సాగాలని అన్నారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘ నేతలు దృష్టి సారించాలని కోరారు.

ex minister jawahar
ex minister jawahar

By

Published : Mar 22, 2021, 4:52 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు పోరాటం ప్రారంభించాలని మాజీ మంత్రి జవహర్ సూచించారు. ఫిట్​మెంట్ తగ్గకుండా పోరాడాలన్న ఆయన.. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హక్కుల కోసం ఉద్యమించాలని సూచించారు.

ఉద్యోగ సంఘాల నాయకులు తమ ప్రాతినిధ్యాలను ప్రక్కన పెట్టి, పోరాటాలు మరిచిపోయారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఉదారంగా ప్రకటించిన ఫిట్మెంట్ కన్నా ఎక్కువ సాధించాలని, మేధావులు మౌనం వీడాలని కోరారు. వారంలో రద్దు అన్న సీపీఎస్ కొండెక్కిందన్న జవహర్‌.. నిత్యావసరాలు ఆకాశం వైపు పరుగెడుతున్నాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details