'లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతానికి యత్నం' - mission build ap news
ఎస్సీల అసైన్డ్ భూములను నామమాత్రపు ధర చెల్లించి లాక్కుంటున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. లిడ్ క్యాప్ భూములను అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ex minister jahawar comments on lid cap lands
ప్రభుత్వ భూముల అమ్మకాలపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఎస్సీల అసైన్డ్ భూములను నామమాత్రపు ధర చెల్లించి లాక్కుంటున్నారని ఆరోపించారు. లిడ్ క్యాప్ భూములను అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం నడిగొప్పులలో ఎస్సీలకు చెందిన 75 ఎకరాలు లేఔట్ చేసి ఆక్రమించారని అన్నారు. కాకినాడ మడ అడవులను ఆక్రమించి భూములను ఇవ్వాలని చూడడం సమంజసమా..? అని నిలదీశారు.