ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు

మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లలో తన భూమిలో నుంచి కాల్వ తవ్వొద్దంటూ ఇంజినీర్​తోపాటు... అక్కడ పని చేస్తున్నవారిని బెదిరించారు.

ex-minister-gutha-mohan-reddy
ex-minister-gutha-mohan-reddy

By

Published : Aug 30, 2020, 9:56 PM IST

మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో తన భూమిలో నుంచి కాల్వ తవ్వొద్దంటూ ఇంజినీర్​తోపాటు... అక్కడ పనిచేస్తున్నవారిని బెదిరించారు. సర్వే ప్రకారం.. పిల్లాయపల్లి కాల్వను ఆయన భూమి మీదుగా తవ్వుతున్న సమయంలో... ఈ ఘటన జరిగింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాలతో... ఆయుధ చట్టం, ఇతర సెక్షన్ల కింద చిట్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత ఇంజినీర్ ఫిర్యాదుతో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు

నెలరోజులే మంత్రిగా..

1978, 1983.. రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన గుత్తా మోహన్ రెడ్డి... నాదెండ్ల భాస్కర్​రావు హయాంలో నెలరోజుల పాటు మంత్రిగా పని చేశారు.

ఇవీచూడండి:ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details