ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు తీర్పుపై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని ఉమా

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి, ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ex minister devineni uma
ex minister devineni uma

By

Published : May 22, 2020, 5:10 PM IST

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైద్యుడు సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుధాకర్​కు ఎక్కడా గాయలు లేవని ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కోర్టు పక్కన పెట్టిందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత, వ్వవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మూడు జిల్లాల పోలీసు యంత్రాంగం సీబీఐ విచారణలో ఇరుక్కున్నాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ స్వయంగా రెండుసార్లు హైకోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. పంచాయతీలకు రంగుల వ్యవహారాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టిందని అన్నారు.

జగన్​ ఎందుకు మాట్లాడరు..?

పోతిరెడ్డిపాడుపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడం లేదని ఉమా ప్రశ్నించారు. తెదేపా హయాంలో 63,373 కోట్లు ఇరిగేషన్​పై ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్​తో జగన్​ మూడుసార్లు భేటీ అయి ఏపీ ఆస్తులను అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details