పంట కొనుగోలు చేసే దిక్కులేక రైతు కన్నీరు పెడుతుంటే... సీఎం జగన్ ఏం చేస్తున్నారని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 3 వేల రూపాయల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వానికి ర్యాపిడ్ కిట్ల కమీషన్ల మీదే శ్రద్ధ ఉందని అన్నారు. రైతులు, పేదవారి సమస్యల మీద పట్టింపు లేదని విమర్శించారు.
రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?: దేవినేని ఉమ
వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతూ తీసుకొచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ex minister devineni uma