ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహంతోనే వైకాపా మంత్రులు తనను బెదిరిస్తున్నారంటూ తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అనేకమార్లు ప్రశ్నించానని... అప్పుడు ఒక్క బెదిరింపు ఫోన్ కూడా రాలేదన్నారు.
15 నెలల వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించినందుకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఉమా చెప్పారు. వీటిపై వెంటనే విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఈ కుట్రలో ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని ఉమ ఆరోపించారు.