ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

15నెలల పాలనలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు..? - ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల వార్తలు

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పనులన్నీ ఆపేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు.

ex-minister-devineni-uma-maheswara-rao
ex-minister-devineni-uma-maheswara-rao

By

Published : Sep 7, 2020, 7:29 PM IST

వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాల్సి వస్తుందని... రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఆపేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చి 15 నెలల గడిచినా..గండికోట నిర్వాసితులకు పరిహారం అందించలేదని అన్నారు. తెదేపా హయాంలో 19 టీఎంసీలకు పైగా రైతులకు నీరు అందించామని గుర్తు చేశారు. నాడు నిర్వాసితులను రెచ్చిగొట్టిన జగన్... ఇవాళ వారికి పరిహారం ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఎన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసిందో చెప్పగలదా అని నిలదీశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే... సమాధానం చెప్పలేక లారీలతో తొక్కిస్తామని బెదిరిస్తారా అని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details