ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Devineni Uma: నదీజలాల విషయంలో జగన్‌, కేసీఆర్‌వి డ్రామాలు: దేవినేని - జగన్ పై దేవినేని ఫైర్ తాజా వార్తలు

నదీజలాల విషయంలో జగన్‌, కేసీఆర్‌వి డ్రామాలని మాజీ మంత్రి దేవినేని ఉమ దుయ్యబట్టారు. ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్​లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad bypoll) కోసం జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

జగన్ పై దేవినేని ఫైర్
ex minister devineni uma fiers on kcr

By

Published : Jul 2, 2021, 6:46 PM IST

నదీజలాల విషయంలో జగన్‌, కేసీఆర్‌వి డ్రామాలు: దేవినేని

తెలుగు రాష్ట్రాల సీఎంలపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (devineni uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీజలాల విషయంలో జగన్‌(jagan), కేసీఆర్‌ (kcr)వి డ్రామాలని దుయ్యబట్టారు. ఎన్నికల ఒప్పందంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad bypoll) కోసం జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నదీజలాల వివాదంపై అపెక్స్ కౌన్సిల్‌లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా సీఎం జగన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

'రైతుల సాగునీటి హక్కులను సీఎం జగన్‌ కాపాడాలి. నదీజలాల వివాదంపై అపెక్స్ కౌన్సిల్‌లో ఎందుకు మాట్లాడలేదు? నదీజలాల సమస్య పరిష్కారానికి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయరు? తెలంగాణ తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా సీఎం జగన్‌ చర్యలు చేపట్టాలి'- దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details