సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి(74) మృతి చెందారు. తొగుట సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన... తర్వాత వివిధ పదవుల్లో కొనసాగారు. అనంతరం సహకారసంఘం ఛైర్మన్‌గా రెండేళ్లపాటు సేవలు అందించారు.
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత - మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
రాజకీయ ప్రస్థానం...
1989లో దొమ్మాట నుంచి తెదేపా ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 1994, 1999 ఎన్నికల్లోనూ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో ఫౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు.
TAGGED:
సిద్దిపేట