వాలంటీర్ వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య - ex minister bandaru car driver suicide
09:24 May 30
వాలంటీర్ వేధింపులు భరించలేక డ్రైవర్ ఆత్మహత్య
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కారు డ్రైవర్ నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా కలపాక గ్రామంలో నివసిస్తున్న నాయుడు అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ తనను వేధిస్తున్నట్లు వాయిస్ మెసేజ్‌లో ఆరోపించాడు. ఆ కారణంగానే చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్, అతని సోదరుడు, కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారు. నిజాయతీగా బతకలేనప్పుడు చనిపోవడం మంచిది. అందరూ నన్ను క్షమించండి. ఇవాలే ఆఖరి రోజు. నేను చనిపోతున్నా.
- నాయుడు