ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..?'

ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేట్‌ వారికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఎం నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు వ్యతిరేకించాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..? అని ప్రశ్నించారు.

Ex Minister Ayyanna Patrudu fires on Jagan Over RTC Lands
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

By

Published : Dec 4, 2020, 5:26 PM IST

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

ఆర్టీసీకి చెందిన 1,300 ఎకరాలను ప్రైవేట్‌ వారికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గతంలో తమను తప్పుపట్టి వాళ్లు 50 ఏళ్లు లీజుకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ, కర్నూలు, తిరుపతిలో రూ.1,500 కోట్ల విలువైన స్థలాలు ఇస్తున్నారన్న అయ్యన్న... 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..? అని ప్రశ్నించారు. సీఎం నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు వ్యతిరేకించాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details