ప్రభుత్వం సరైన విధానాలు తీసుకుంటే కోర్టులు ఎందుకు తప్పుబడతాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి 40వేల ఎకరాలు సేకరిస్తే, దానిలో 4వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టేలు విధించాయని గుర్తు చేశారు. మిగిలిన 36వేల ఎకరాలు పంచడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని నిలదీశారు. ప్రభుత్వం అంతా సక్రమంగా, చట్టప్రకారం చేస్తే న్యాయస్థానాలు ఎందుకు అడ్డుకుంటాయన్నారు. నిజంగా జగన్ ప్రభుత్వానికి పేదలపై అంత ప్రేమే ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం వారి కోసం కట్టించిన 6లక్షల ఇళ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై నిందలేస్తూ, ప్రజలను మోసగించాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు.
'సరైన నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు ఎందుకు తప్పుబడతాయి' - ex minister ayyanna Patrudu latest news
ప్రభుత్వం సరైన విధానాలు తీసుకుంటే కోర్టులు ఎందుకు తప్పుబడతాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. నిజంగా జగన్ ప్రభుత్వానికి పేదలపై అంతటి ప్రేమే ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం వారి కోసం కట్టించిన 6లక్షల ఇళ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.
ex minister ayyanna Patrudu