వచ్చే ఎన్నికల్లో మీకు గుండు కొట్టడం ఖాయం: అయ్యన్నపాత్రుడు - అయ్యన్నపాత్రుడు
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుండు కొట్టడం ఖాయమని అన్నారు.
![వచ్చే ఎన్నికల్లో మీకు గుండు కొట్టడం ఖాయం: అయ్యన్నపాత్రుడు ex minister ayyanna patrudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8671161-169-8671161-1599164877506.jpg)
ex minister ayyanna patrudu
వచ్చే ఎన్నికల్లో జగన్, విజయ సాయిరెడ్డిలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుండు కొట్టడం ఖాయమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వివేకా చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న విజయసాయి తెలుగు కోసం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం జగన్‌దని మండిపడ్డారు.