ఐటీ దాడులను వైకాపా నాయకులు కావాలనే చంద్రబాబు అవినీతి అని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులపై అధికారులు నోట్ విడుదల చేశారని.. వాటన్నింటినీ చంద్రబాబుకు ఆపాదించటం సరికాదన్నారు. అవినీతి కేసుల్లో ముద్దాయిలుగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులు అలాగే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. రాజధాని బిల్లు విషయంలో ఆర్డినెన్స్ తీసుకోస్తామనటంరాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు.
'జైల్లో ఉండి వచ్చిన వారికి అలాగే కనిపిస్తారు' - దేశ వ్యాప్తంగా ఐటీ సోదాల వార్తలు
చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులను చంద్రబాబుకు ముడిపెట్టడమేంటని ప్రశ్నించారు.
ex minister anandababu react on it raids in telugu states