ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు సవాల్​పై సీఎం జగన్​కు చిత్తశుద్ధి లేదు: అమర్​నాథ్​రెడ్డి - ex minister amarnath reddy criticise cm jagan on three capitals news

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ అధికారంలోకి వచ్చాక మాట మార్చి.. ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి అమర్​నాథ్​రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు వెళ్లేటప్పుడే మూడు రాజధానులని చెప్పి పోటీ చేయాల్సిందని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు పని చేయాలన్న ఆయన.. ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

చంద్రబాబు సవాల్​పై సీఎం జగన్​కు చిత్తశుద్ధి లేదు: అమర్​నాథ్​రెడ్డి
చంద్రబాబు సవాల్​పై సీఎం జగన్​కు చిత్తశుద్ధి లేదు: అమర్​నాథ్​రెడ్డి

By

Published : Aug 7, 2020, 12:29 AM IST

అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... ఇందుకు వైకాపా సిద్ధమా..? అని మాజీ మంత్రి అమర్​నాథ్​రెడ్డి సవాల్​ విసిరారు. తెదేపా అధినేత చంద్రబాబు విసిరిన సవాల్​పై సీఎం మాట్లాడకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటేనే వారి చిత్తశుద్ధి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రజలు సరైన సమయంలో వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు పని చేయాలని.. ఎన్నికలకు ముందే మూడు రాజధానులని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందని అమర్​నాథ్​రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు.. తీసుకునే నిర్ణయాలపై కనీసం ప్రజాభిప్రాయం కోరకపోవడం దారుణమని అన్నారు. మూర్ఖంగా ముందుకెళ్తే భవిష్యత్తులో చరిత్రహీనులుగా నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details