కరోనా సమయంలోనూ వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. వ్యవస్థలోని లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానికి బడ్జెట్ లేదని చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. వెయ్యి రూపాయలు కేంద్రం కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని వైకాపా ఎమ్మెల్యేలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం ఆ వెయ్యి రూపాయలు ఇచ్చుంటే కేంద్రం ఇచ్చిన రూ. 2354 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని... ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?: అఖిలప్రియ - ఏపీలో అధికారుల సస్పెన్షన్ వార్తలు
ప్రభుత్వ లోపాలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఎంటని తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ex minister akhila priya